![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1015 లో.. వసుధార మిషన్ ఎడ్యుకేషన్ పని మీద బయటకు వెళ్తుంటే అప్పుడే కార్ ఆగిపోతుంది. అంతలోనే మను అటుగా వెళ్తూ వసుధార దగ్గర ఆగుతాడు. ఏమైందని అడుగగా కార్ స్టార్ట్ అవట్లేదని చెప్తుంది. నేను చూస్తానని మను కార్ ఎందుకు స్టార్ట్ అవట్లేదో చూస్తాడు. అయిన స్టార్ట్ అవ్వదు.. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి అని మను పిలుస్తాడు. నేను ఇంటికి వెళ్లడం లేదని వసుధార చెప్తుంది.
ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి తీసుకొని వెళ్తానని మను అనగానే.. ఆ ప్లేస్ కి మీరు రాలేరని వసుధార అంటుంది. మీరు అలా అంటుంటే నాకు చాలా ఎక్సైట్ గా ఉంది పదండి అని మను అంటాడు. సరే అని ఇద్దరు కలిసి వెళ్తారు. మరొకవైపు వసుధారని ఎలా దక్కించుకోవాలని రాజీవ్.. ఎండీ సీట్ ని ఎలా పొందాలని శైలేంద్ర ఇద్దరు ఆలోచిస్తుంటారు. అప్పుడే అటుగా ఒకే కార్ లో వెళ్తున్న వసుధార, మను ఇద్దరు కన్పిస్తారు. ఒకసారి అటు చూడని రాజీవ్ కి శైలేంద్ర చూపిస్తాడు. వాళ్ళని చూసి రాజీవ్ కోపంతో ఊగిపోతాడు. వాడు నా మరదలిని తీసుకొని వెళ్లడమేంటని ఆవేశపడుతుంటే.. రాజీవ్ ని శైలేంద్ర కంట్రోల్ చేస్తాడు.. మనకి కూడా టైమ్ వస్తుంది. దాని కోసం వెయిట్ చెయ్యాలి. ముందు ముందు ఎపిసోడ్ లు ఇంకా బాగుంటాయని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నామని వసుధారని మను అడుగుతాడు. రిషి సర్ దగ్గరికి అని వసుధార అనగానే.. మను ఒక్కసారిగా షాక్ అయి కార్ ఆపుతాడు. అంటే రిషి సర్ జ్ఞాపకాల దగ్గరికి అని వసుధార అంటుంది.
ఆ తర్వాత రిషితో కలిసి వసుధార గతంలో మిషన్ ఎడ్యుకేషన్ గురించి వెళ్లిన చోటుకి మనుని తీసుకెళ్తుంది. అక్కడ రిషితో గడిపిన క్షణాలు గుర్తుకుచేసుకుంటుంది వసుధార. అక్కడ కొంతమంది పిల్లలకు, పేరెంట్స్ కు మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పి.. తమ పిల్లలు చదుకోవడానికి వాళ్ళని ఒప్పిస్తారు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్లారో మహేంద్ర, అనుపమలకి వసుధార చెప్తుంది. మను గారు చాలా హెల్ప్ చేశారని మహేంద్రకి వసుధార చెప్తుంది. భోజనం చేసి వెళ్ళని మనుతో మహేంద్ర అంటాడు. వద్దని మను చెప్పి.. అప్పుడే అనుపమ తీసుకొని వచ్చిన వాటర్ తాగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |